నేలకొండపల్లిలో బుద్ధుడి జయంతి మహోత్సవం

నేలకొండపల్లిలో బుద్ధుడి జయంతి మహోత్సవం

నేలకొండపల్లి, వెలుగు : మండల కేంద్రంలో సోమవారం బౌద్ధ స్థూపం వద్ద బుద్ద వందనం, పంచ శీల చదివి బుద్ధుడి జయంతోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు నేలకొండపల్లి సెంటర్ నుంచి బౌద్ధ స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుద్ధుడి జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రధాన వక్తలు బైరి నరేశ్, రెంజర్ల రాజేశ్​మాట్లాడారు.

నేలకొండపల్లి బౌద్ధ స్థూప నిర్వహణ సరిగాలేకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. కాగా, కార్యక్రమానికి బీఎస్​ఐ అధ్యక్షుడు పెద్దపాక వెంకట్, గౌరవ అతిథులు జి. రాజేశ్వరరావు, ఈదయ్య, బసవయ్య పత్తి పాటి వెంకటేశ్వర్లు, మీసాల రామ్ చందర్, పీవీ సిద్ధార్థ, పాడకంటి రాంబాబు, సంపత్, వనం మహేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.