
పెబ్బేరు, వెలుగు/అచ్చంపేట, / నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో గల శ్రీలలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది మహిళలు వచ్చి, వ్రతం ఆచరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ, అన్నప్రసాద వితరణ చేశారు.
అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని సత్యసాయి మందిరంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు పసుపు, కుంకుమ వాయినంగా ఇచ్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ అనంతరంఅన్నదానం చేశారు.