- తయారీలో సమస్యల కారణంగానే
న్యూఢిల్లీ:మారుతి సుజుకి ఇండియా గ్రాండ్ విటారా మోడల్‌లోని 39,506 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన వాహనాల్లో ఫ్యూయల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సరిగా పనిచేయకపోవచ్చని అనుమానం వ్యక్తమైంది. ఈ లోపం కారణంగా స్పీడోమీటర్‌లో చూపించే ఫ్యూయల్ లెవెల్, అసలైన లెవెల్‌కు సరిపోకపోవచ్చు”అని వివరించింది.
ప్రభావిత వాహన యజమానులకు అథరైజ్డ్ డీలర్ వర్క్‌షాప్‌ల ద్వారా సమాచారం అందుతుందని, వాహనాలను పరిశీలించి, లోపాలుంటే ఉచితంగా మార్చి ఇస్తామని మారుతి తెలిపింది. వినియోగదారుల భద్రతను కాపాడడమే కాకుండా, కంపెనీపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ లక్ష్యమని వివరించింది.
