డిస్కవరీ చానల్‌లో ప్రముఖ షో ‘మిత్‌బస్టర్స్’ మాజీ యాంకర్ గ్రాంట్ ఇమహారా ఇవాళ( మంగళవారం, జులై-14) చనిపోయారు. ఆయన వయస్సు 49 ఏళ్లు. ఈ విషయాన్ని డిస్కవరీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాంట్ చాలా అద్భుతమైన వ్యక్తి అని …ఆయన మరణం విచారకరమని చెప్పారు. గ్రాంట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ఇమహారా ఆకస్మిక మృతికి కారణాలు తెలియలేదు. ‘మిత్ బస్టర్స్’ ప్రోగ్రాంకు యాంకరింగ్ చేశారు గ్రాంట్ ఇమహారా.

