బాలుకి లైఫ్ లో గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌

బాలుకి లైఫ్ లో గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌

ఒక రోజు బాలు ఏవీఎం స్టూడియోలో ఎల్.ఆర్‌‌‌‌.ఈశ్వరితో కలిసి పాట పాడుతుంటే.. షూటింగ్‌‌ గ్యాప్‌‌లో బయటకు వచ్చిన ఎంజీఆర్‌‌కు ఆ పాట వినిపించింది. అది తాను నటించిన ‘నీరుంనిరుప్పుం’ తెలుగు వెర్షన్‌‌లోని పాట కావడంతో ఎంజీఆర్‌‌ మరుసటి రోజు బాలుని పిలిపించారు. తాను తీయబోయే ‘అడిమైపెణ్‌‌’ అనే భారీ చిత్రంలో ‘ఆయురం నిలవే వా’ పాటను బాలు చేత పాడించమని మహదేవన్‌‌కు చెప్పారు. పది రోజుల్లో పాట రికార్డింగు ఉందనగా బాలుకు టైఫాయిడ్‌‌ వచ్చింది. ఆ అవకాశం చేజారినట్లే భావించారు బాలు. ఈ పాటను వేరెవరితోనే పాడించేసి ఉంటారని అనుకున్నారు. కానీ ఇరవై రోజులయ్యాక ఎమ్జీఆర్‌‌ మేనేజరు ‘రిహార్సల్‌‌కు రాగలవా’ అని బాలుని అడిగారు. ఆ పాట పోయినా మరొకటి దక్కిందని బాలు వెళ్లారు. కానీ అది అప్పుడు అనుకున్న పాటే. బాలు, సుశీలతో కలిసి ఆ పాట పాడుతుంటే కొందరు తొంగి చూడసాగారు. వారంతా ఎమ్జీఆర్‌‌తో సినిమాలు తీసే నిర్మాతలు. రికార్డింగు పూర్తయ్యాక ఎమ్జీఆర్‌‌ ప్రెస్‌‌మీట్‌‌ పెట్టి ‘ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు. నేను నటించే మీ చిత్రాలలో ఇతని చేత ఒక్క పాటైనా పాడించండి’ అని చెప్పారు. ‘సారీ సర్‌‌. నాకు టైఫాయిడ్ రావడం వల్ల మీ షెడ్యూల్‌‌కి ఇబ్బంది అయ్యింది’ అని బాలు అంటే.. ‘ఈ పాట వేరే వారితో పాడించుకొని షూటింగు పూర్తి చేసేవాడిని. కానీ నువ్వు నాకు పాడుతున్నావని అందరికీ తెలిసింది. వేరొకరు పాడితే, నీ పాట నచ్చలేదేమో అనుకుంటారు. అది నీ భవిష్యత్తుకు దెబ్బ. అందుకే షూటింగు వాయిదా వేశాను’ అన్నారట. ఆ పాటకు బాలుకు బెస్ట్ సింగర్‌‌‌‌ అవార్డు వచ్చింది.

వీరాట్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్‌

రైల్వే జాబ్ కొట్టాలంటే.. ఈ అంశాలపై ఫోకస్ పెట్టండి

నేను డ్రగ్స్ వాడలే.. జస్ట్ చాట్ చేశా