అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. భారీ ఆఫర్లు ఇవే..!

అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. భారీ ఆఫర్లు ఇవే..!

న్యూఢిల్లీ: పండుగల సీజన్ వేళ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా తన యాన్యువల్‌ మెగా సేల్ ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ తేదీలను ప్రకటించింది. వచ్చే నెల 8 నుంచి ఇది ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్, నిత్యావసర సరుకులపై ఈ ఏడాది అత్యంత భారీ డిస్కౌంట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్‌స్టంట్ తగ్గింపుతో పాటు, ప్రైమ్ సభ్యులకు అదనంగా మరో 10 శాతం వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

బ్లాక్‌బస్టర్ డీల్స్, ఎక్స్‌ఛేంజ్ మేళా, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. డెలివరీలను మరింత వేగంగా జరిపేందుకుఅమెజాన్ దేశవ్యాప్తంగా 1,60,000 తాత్కాలిక ఉద్యోగులను తీసుకుంది. నెట్‌వర్క్ కెపాసిటీ పెంచేందుకు 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 150 డెలివరీ స్టేషన్లను ప్రారంభించింది. 

నిమిషాల్లో డెలివరీ అందించే 'అమెజాన్ నౌ' సేవలు ప్రస్తుతం తిరుపతి, వరంగల్ సహా 60 నగరాల్లో ఉండగా, దీపావళి నాటికి వీటిని 100 నగరాలకు విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది.