చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్న జంట

చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్న జంట

సరిగ్గా 101 రోజులు... 29 రాష్ట్రాలు,  ఐదు యూనియన్​​ టెరిటరీల జర్నీ. ఇది నవీ ముంబైకి చెందిన కౌస్తవ్​ ఘోష్, లక్ష్మి సోర్టీల గోల్​. అయితే వీళ్లు ట్రావెలర్స్ కాదు. ఇదేదో సరదాగా చేస్తున్న ట్రిప్​ అంతకన్నా కాదు. నలుగురి బాగుకోసం వాళ్లు చేస్తున్న జర్నీ ఇది. దీని ద్వారా ప్యాండెమిక్​ వల్ల నష్టపోయిన చిన్న చిన్న వ్యాపారులకు చేయూతనివ్వాలి అనుకుంటున్నారు వీళ్లు. ఇంతకీ ఈ కపుల్​ కథేంటంటే.. 
ఇప్పటికే ఇరవై ఐదు రాష్ట్రాలు, రెండు యూనియన్​ టెరిటరీలు చుట్టేసిన ఈ జంట జర్నీ  కిందటి ఏడాది డిసెంబర్​ ఒకటిన మొదలైంది. దాని వెనుకున్న కారణం ప్యాండెమిక్​ వల్ల మూత పడిన, నష్టాల్లో ఉన్న స్టార్టప్స్​కి తిరిగి ఊపిరి పోయడమే. అయితే ఇదేదో కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. రెండున్నరేండ్ల కిందటే  నలుగురి కోసం ఈ అడుగులు వేశారు వీళ్లు. 
ఆ ఇన్​స్పిరేషన్​తో
నవీ ముంబైలోని ఖర్ఘర్​లో ఉంటున్న ఈ కపుల్​కి ట్రావెలింగ్​ అంటే చాలా ఇష్టం. కొత్త  కొత్త  ప్లేస్​లని ఎక్స్​ప్లోర్​ చేయడమంటే మరింత సరదా. అలా రెండున్నర ఏండ్ల కిందట నార్త్​ ఈస్ట్​ టూర్​కి వెళ్లారు​. ఆ టూర్​  మెయిన్​ గోల్​ అక్కడున్న లోకల్​ షాపులని, ఫుడ్​ స్టార్టప్స్​ని ఎక్స్​ప్లోర్​ చేయడమే. ఆ ట్రిప్​లో ‘ఫ్రీ ఆఫ్​ కాస్ట్​ క్యాంపెయిన్​’తో వందకి పైగా చిన్న చిన్న బిజినెస్​లని.. వాటి వెనకున్న కథల్ని సోషల్​ మీడియాలో షేర్​ చేశారు​. వాటిని 75 లక్షల మంది చూశారు. ఆ ఇన్​స్పిరేషన్​తోనే ఇండియా మొత్తం తిరిగి వీలైనన్ని ఎక్కువ లోకల్​ బిజినెస్​లని ఎక్స్​ప్లోర్​ చేయాలనుకున్నారు. వాటి ఇన్​స్పిరేషనల్​ కథల్ని.. వాటిని నిలబెట్టడానికి ఎంట్రప్రెనూర్స్​ పడుతున్న స్ట్రగుల్స్​ని అందరికీ చెప్పాలనుకున్నారు. కానీ, ప్యాండెమిక్​ వాళ్ల  కలలకి బ్రేక్​ వేసింది. 
అలా మొదలైంది.. 
నార్త్​ ఈస్ట్​ టూర్​ పూర్తవ్వగానే ఇండియా మొత్తం చుట్టేయాలన్నది ఈ జంట ప్లాన్​. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు కూడా. కానీ, అంతలోనే ప్యాండెమిక్​ వచ్చింది. ఇల్లు కదల్లేని పరిస్థితి. కరోనా వల్ల ఎన్నో స్టార్టప్స్ మూతపడ్డాయి. లోకల్​ బిజినెస్​లు నష్టాల్ని చవి చూశాయి. అప్పుడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చిన్న బిజినెస్​లు నిలదొక్కు కునేలా తయారు చేయాలనుకున్నారు. వాటిని తిరిగి నిలబెట్టడానికి బిజినెస్​ స్ట్రాటజీస్​ చెప్పాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే కిందటి ఏడాది నవంబర్​లో ‘ది గ్రేట్​ ఇండియా ట్రావెల్​’ని మొదలుపెట్టారు.‘ఐ సపోర్ట్​ యు.. ఐ సపోర్ట్​ యువర్​ బిజినెస్’​ అన్న మోటోతో 101 రోజుల ట్రిప్​ని​ స్టార్ట్​ చేశారు. ఈ క్యాంపెయిన్ కోసం12 మంది ఎంప్లాయిస్​ని కూడా  తీసుకున్నారు​. 
ఇలా సపోర్ట్​ చేస్తాం
ఈ క్యాంపెయిన్​లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని లోకల్​ బిజినెస్​లని ఎంకరేజ్​ చేస్తున్నారు వీళ్లు. ఎంట్రప్రెనూర్స్​కి మార్కెటింగ్​ స్ట్రాటజీలు చెప్తూ, గైడ్​ చేస్తున్నారు. నెట్​వర్క్​ పెంచుకోవడంలో ట్రైనింగ్​ ఇస్తున్నారు. ఇన్వెస్టర్స్​ని చూపిస్తూ, ఆన్​లైన్ మీడియా లో ఎక్స్​పోజర్​ పెంచుతున్నారు. అలా ఇప్పటివరకు 21 వేల కిలోమీటర్ల జర్నీని పూర్తి చేసింది ఈ జంట. రోటరీ క్లబ్​, రోట్రాక్ట్​ క్లబ్​, ఇన్నర్​ వీల్​ క్లబ్స్​ సాయం తో 700 మంది ఎంట్రప్రెనూర్స్​ని  గైడ్​ చేశారు. 
సొంత ఖర్చుతో.. 
ఈ క్యాంపెయిన్ కోసం ఐదు లక్షల రూపాయలు దాచుకున్నారు ఈ కపుల్​. వీళ్ల ఆలోచన నచ్చి హోండా కంపెనీ వీళ్లకి ఒక కారు గిఫ్ట్​గా ఇచ్చింది. దాంతోనే  ఇద్దరు పిల్లలతో కలిసి రోజుకి 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు​. ఖర్చు తగ్గించడానికి లోకల్​ ఫ్రెండ్స్​, ఫ్యామిలీ మెంబర్స్​ ఇండ్లకు వెళ్తున్నారు. అది కుదరనప్పుడు చిన్న హోటళ్ళలో​ తింటున్నారు. అయితే ఈ జర్నీలో షాపింగ్​ని పూర్తిగా అవాయిడ్​ చేశారు. కేవలం మూడు సూట్​కేస్​ల బట్టలతోనే ట్రావెల్​ చేస్తున్నారు. 
ఈ జర్నీ లైఫ్ టైం లెర్నింగ్ ఇన్వెస్ట్ మెంట్. దేశంలోని కొన్ని ప్రాంతాల మీద మాకున్న అపోహలు అన్నింటినీ తుడిచేసింది. దీనివల్ల డిఫరెంట్ కల్చర్స్ ని చూసే అవకాశం వచ్చింది. కాశ్మీరి నూన్ చాయ్ నుంచి బస్తర్ ట్రైబల్ స్పెషల్ చీమల చట్నీ వరకు.. మేము ఎక్స్ పీరియన్స్ చేసినవన్నీ డాక్యుమెంటరీలా తీయానుకుంటున్నారు ఈ జంట.