సీట్లు ఫుల్ చేసుకోవడానికి థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

సీట్లు ఫుల్ చేసుకోవడానికి థియేటర్లకు గ్రీన్ సిగ్నల్
  • ఫిబ్రవరి 1 నుండి థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ
  • అనుమతించిన సమాచార మంత్రిత్వ శాఖ

మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో 100% ఆక్యుపెన్సీని అనుమతిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది దాదాపు ఏడు నెలలు మూతపడిన సినిమా థియేటర్లకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించింది. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. సినీ అభిమానులు మాత్రం కరోనాకు భయపడి థియేటర్లకు దూరంగా ఉంటున్నారు.

సినిమా హాళ్ళలో 100% సీటింగ్‌కు అనుమతించడం వలన అటు థియేటర్ యాజమాన్యాలు, ఇటు ప్రేక్షకులు అనుసరించాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్ఓపి) మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కంటైయిన్‌మెంట్ జోన్లలో సినిమా హాళ్లు ఓపెన్ కావని తెలిపింది. అలాగే సిబ్బంది మరియు ప్రేక్షకులందరూ కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం, ఫేస్ కవర్లు లేదా ఫేస్ మాస్క్‌లను అన్ని సమయాల్లో ఉపయోగించాలని తెలిపింది. అదేవిధంగా థియేటర్ సిబ్బంది మరియు ప్రేక్షకులు వారివారి ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని తెలిపింది.

అదేవిధంగా సినిమా ఇంటర్‌వెల్ సమయంలో కెఫెటేరియా, లాబీలు మరియు వాష్‌రూమ్‌లలో రద్దీని నివారించడానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించింది. బ్రేక్ సమయంలో అందరూ ఒకేసారి బయటకు వెళ్లకుండా.. కొంతమందిని ఒకసారి, మరికొంతమందిని ఇంకోసారి బయటకు పంపడానికి ప్రయత్నించాలని చెప్పింది. ఇందుకోసం అవసరమైతే బ్రేక్ సమయాన్ని పెంచుకోవచ్చని కూడా తెలిపింది. మల్టీప్లెక్స్‌లలో రద్దీని తగ్గించడానికి షో టైమింగ్స్ మార్చుకోవచ్చని తెలిపింది. ప్రతి షో తర్వాత సినిమా థియేటర్లను శుభ్రపరచాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా థియేటర్‌లోని అన్ని ఎయిర్ కండిషన్ల టెంపరేచర్ 24-30 °C ఉండేలా చూడాలని తెలిపింది.

For More News..

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు

తల్లి శవాన్ని పదేళ్లు ఫ్రిజ్‌​లో దాచిన కూతురు