భూగర్భ జలాలు 4.26 మీటర్లు పెరిగాయి

భూగర్భ జలాలు 4.26 మీటర్లు పెరిగాయి
  • ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌ రజత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో భూగర్భ జలాలు 4.26 మీటర్లు పెరిగాయని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌ రజత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. సోమవారం జలసౌధలో తెలంగాణ, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ రజత్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన నిర్వహించారు. భూ ఉపరితలం నుంచి 10 మీటర్ల లోతున భూగర్భ జలాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు 106 శాతం పెరిగాయని చెప్పారు. 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాలు గతంతో పోల్చితే 87 శాతం తగ్గాయని తెలిపారు. 83 శాతం మండలాల్లో భూగర్భ జలమట్టం పెరిగిందని, 93 శాతం గ్రామ పంచాయతీలు సేఫ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో ఉన్నాయని పేర్కొన్నారు. మిషన్‌‌‌‌‌‌‌‌ కాకతీయలో భాగంగా 26,700 చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ఎత్తిపోసి చెరువులు నింపడం, 638 చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాంలు, 138 రీచార్జ్‌‌‌‌‌‌‌‌ షాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణంతోనే భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.