జూన్‌‌‌‌ 1న వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో గ్రూప్1 హాల్ టికెట్స్

జూన్‌‌‌‌ 1న వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో గ్రూప్1 హాల్ టికెట్స్
  • టీజీపీఎస్సీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు :  జూన్‌‌‌‌ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్‌‌‌‌ 1 హాల్‌‌‌‌ టికెట్లు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబా టులో ఉండనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (టీజీపీఎస్సీ) బుధవారం ఒక ప్రటకనలో పేర్కొంది. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నామని తెలిపింది. పరీక్షకు 30 నిమిషాల ముందే ఎగ్జామ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ గేట్లు మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. 

ఉదయం 9.30 నుంచి ప్రతి సెంటర్‌‌‌‌‌‌‌‌లో అభ్యర్థుల బయోమెట్రిక్‌‌‌‌ను ఇన్విజిలేటర్లు తీసుకుంటారని తెలిపారు. కాగా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌‌‌‌పీఎస్సీ)ను.. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)గా ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మీదట టీజీపీఎస్సీగా కరస్పాండెన్స్ ఉంటుందని పేర్కొన్నారు.