
హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షా విధానానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్ వంటి వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించింది.
గతేడాది డిసెంబర్ 29న 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగానే ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తు చేయడాని కంటే ముందు ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని టీఎస్‌పీఎస్సీ సూచించింది.