జనవరిలో జీఎస్​టీ కలెక్షన్స్​ రూ. 1.38 లక్షల కోట్లు

జనవరిలో జీఎస్​టీ కలెక్షన్స్​ రూ. 1.38 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జనవరి నెలలో జీఎస్​టీ వసూళ్లు రూ. 1.38 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది జనవరితో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. వరసగా నాలుగో నెలలోనూ జీఎస్​టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లను దాటాయి. జనవరి నెల వసూళ్లలో సీజీఎస్​టీ రూ. 24,674 కోట్లు, ఎస్​జీఎస్​టీ రూ. 32,016 కోట్లు, ఐజీఎస్​టీ రూ. 72,030 కోట్లు, సెస్​ రూ. 9,674 కోట్లు ఉన్నట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ తెలిపింది. జీఎస్​టీ వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు 2021 ఏప్రిల్​నెలలో వచ్చాయి. ఆ నెలలో వసూళ్లు రూ. 1,39,708 కోట్లు. జనవరి 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి వసూళ్లు 25 శాతం అధికమని ఫైనాన్స్​ మినిస్ట్రీ పేర్కొంది. ఎకనమిక్​ రికవరీతోపాటు, ఎగవేతదారులపై నిఘా, ఫేక్​ బిల్లర్లపై చర్యలు వల్ల వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయని వివరించింది. రాబోయే నెలల్లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ వెల్లడించింది. జనవరి 2022లో 1.05 కోట్ల జీఎస్​టీఆర్​–3బీ ఫైలయ్యాయని, ఇందులో 36 లక్షలు క్వార్టర్లీ రిటర్న్స్​ అని ఫైనాన్స్​ మినిస్ట్రీ తెలిపింది.