
న్యూఢిల్లీ:పెట్రోల్ వంటి కొన్ని మినహా మనం ఏ వస్తువు కొన్నా దానిపై జీఎస్టీ పడుతోంది. ఈ పన్నును కొనుగోలుదారుడు నేరుగా ప్రభుత్వానికి చెల్లించడు. చివరికి జీఎస్టీ భారాన్ని మోసేది కొనుగోలుదారుడే అయినా అది ప్రభుత్వ ఖజానాకు మాత్రం చెల్లించేది వ్యాపార సంస్థలు. ఇది వినిమయ పన్ను కాబట్టి ఎండ్ కస్టమరే తన జేబు నుంచి కట్టాలి. బిల్లు ట్రాన్స్పరెంట్గా ఉన్నా లేకున్నా జీఎస్టీ చెల్లింపు మాత్రం తప్పదు. ప్రభుత్వం వసూలు చేస్తున్న మొత్తం జీఎస్టీలో మూడింట రెండువంతుల మొత్తాన్ని సగం జనాభా భరిస్తోంది. ధనికులు నాలుగు శాతం మొత్తాన్ని భరిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే 90 శాతం జీఎస్టీని 22 శాతం మంది కడుతున్నారు. వీటిలో రూ.50 కోట్లకుపైగా టర్నోవర్ గల సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. జీఎస్టీలో రెండు విషయాలు ముఖ్యమైనవి. పన్ను మూలం మొదటిది కాగా, దానిని ఎవరు భరిస్తున్నారనేది రెండోది. వసూళ్లలో ఐదవ వంతుకు పైగా పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలవుతున్నది. పరోక్ష పన్ను భారంలో ఎక్కువ భాగం జనాభాలోని సగం మంది పేదలు భరిస్తున్నారు. జీఎస్టీ మెకానిజంలో గొప్ప విషయం ఏమిటంటే, ఎండ్ కస్టమర్ మాత్రమే ఉత్పత్తి లేదా సేవను పొందడానికి అవసరమైన పన్నును మొత్తం చెల్లిస్తారు. తను కొనే వస్తువుకు లేదా సేవకు మాత్రమే పన్ను కడతాడు.
పన్నుపై పన్ను ఉండదు...
జీఎస్టీ విధానంలో ఒకసేవకు/ఉత్పత్తికి ఎక్కువ సార్లు (పన్నుపై పన్ను) చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చాక క్యాస్కేడింగ్ ట్యాక్సేషన్ తొలగిపోయింది. ఉదాహరణకు ఫ్యూయల్‌పై వ్యాట్ వేయడం వల్ల క్యాస్కేడింగ్ ట్యాక్స్ వర్తిస్తుంది. యూజర్ ఫ్యూయల్‌పై ట్యాక్స్‌తోపాటు ట్రాన్స్పోర్ట్పైనా ట్యాక్స్‌ను భరించాలి. ఏ విధంగా అయినా ఎండ్ యూజరే పన్ను భారాన్ని భరించాలి. జీఎస్టీ విధానంలో ఎండ్ యూజర్ నేరుగా పన్ను చెల్లించకపోయినప్పటికీ భారం మాత్రం అతనిపైనే ఉంటుంది! అంటే కస్టమర్ జేబు నుంచి వచ్చే జీఎస్టీని వ్యాపార సంస్థ ప్రభుత్వానికి కడుతుంది. సబ్బులు, షాంపూల వంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులను డిస్ట్రిబ్యూటర్లు చిన్న షాపులకు పంపిస్తారు. ఇది వరకే వాటిపై జీఎస్టీ ఉంటుంది. షాపు యజమానులు తమ లాభం చూసుకొని అమ్ముతారు. వీళ్లు అమ్మిన ప్రొడక్టులకు కొన్నిసార్లు బిల్లు ఇవ్వరు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను తీసుకోరు. అయినా జీఎస్టీ మాత్రం వసూలవుతుంది. దీనిని డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తాడు. అందుకే జీఎస్టీ ఎక్కువగా కడుతున్నది పెద్ద ట్యాక్స్పేయర్లని చెబుతారు. భారతదేశంలో వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసే ఆరు కోట్ల వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటిలో కేవలం 1.35 కోట్ల మంది మాత్రమే జీఎస్టీ నెట్‌వర్క్‌లో నమోదు చేసుకున్నాయి. దాదాపు 15 లక్షల మంది కంపోజిషన్ పన్ను చెల్లింపుదారులు. వీరిలో చాలా మంది టర్నోవర్ రూ.75 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. ప్రతి క్వార్టర్లో స్థూల రాబడిని బట్టి పన్ను చెల్లిస్తారు. రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారులలో, ఐదవ వంతు మంది పన్నులో 90 శాతం మొత్తాన్ని చెల్లిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఉత్పాదక సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల భారీగా వసూళ్లు జరుగుతున్నాయి. మరింత మంది పన్ను కట్టేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్పర్టులు సూచిస్తున్నారు.