GT vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మిల్లర్ స్థానంలో కేన్ మామ

GT vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మిల్లర్ స్థానంలో కేన్ మామ

ఐపీఎల్ 2024లో నేడు(ఏప్రిల్ 4) మరో రసవత్తర పోరు జరగనుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్.. శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఈ మ్యాచ్‍లో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. టైటాన్స్ జట్టులో డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియంసన్ జట్టులోకి రాగా, పంజాబ్ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజా చోటు దక్కించుకున్నాడు.

ఇప్పటివరకూ ఇరు జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడగా.. టైటాన్స్ రెండింటిలో, కింగ్స్ ఒక దానిలో విజయం సాధించాయి.

తుది జట్లు

గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్,  కేన్ విలియంసన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్పీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.

ALSO READ :- IPL 2024: కేకేఆర్‌కు బిగ్ షాక్..చెన్నైతో మ్యాచ్‌కు యువ సంచలనం దూరం