'పఠాన్' చిత్రానికి వ్యతిరేకంగా భజరంగ్ దళ్ నిరసన

'పఠాన్' చిత్రానికి వ్యతిరేకంగా భజరంగ్ దళ్ నిరసన

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలోని ఓ పాటపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ పాట విడుదలైనప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్ లోని వస్త్రాపూర్ లో ఉన్న ఆల్ఫా వన్ మాల్ లో నిర్వహించిన సినిమా ప్రమోషన్ లో భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ తో పాటు, సహ నటుల పోస్టర్లను చించివేశారు. సినిమాను విడుదల చేస్తే మరింత ఉధృతంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు మాల్ లోని ఆస్తులను ధ్వంసం చేశారు.

పఠాన్ మూవీలోని బేషరమ్ రంగ్ పాటపై మొదటిసారి మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం తెరకెక్కింది. ఫస్ట్ లుక్ లోని పాటలో కాస్ట్యూ్మ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ పాటను డర్టీ మెండ్ సెట్ తో చిత్రీకరించట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఐనాక్స్ థియేటర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. యాజమాన్యం సినిమాను ఇక్కడ విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు. కాగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ జనవరి 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.