
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఎగ్జిబిషన్‌లోని వివిధ రోబోట్ స్టాల్స్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అనేక రోబోటిక్ చేసే పనులను గమనించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి Xలో ఒక ఆసక్తికరమైన ఓ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వీడియోలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి రోబోట్ టీ అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా అగ్నిప్రమాదాల సమయంలో మానవులకు రోబోట్ ఎలా సహాయం చేస్తుందో కూడా ప్రధాని మోదీ ఆసక్తిగా చూస్తున్నట్లు ఈ క్లిప్ చూపించింది. రోబోలు వివిధ రంగాలలో ఎనేబుల్‌గా ఎలా తమ పాత్ర పోషిస్తాయో రోబోటిక్ ఇంజనీర్లు ప్రధాని మోదీకి వివరించారు. "రోబోటిక్స్‌తో భవిష్యత్తులో అంతులేని అవకాశాలను అన్వేషించండి" అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఎక్స్ పోస్ట్‌లో రాశారు.
Also Read :- గుడ్ టచ్ & బ్యాడ్ టచ్.. చిన్నప్పట్నుంచే పిల్లలకు నేర్పించండిలా
అంతకుముందు రోజు, అహ్మదాబాద్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2023.. 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఎగ్జిబిషన్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా పాల్గొన్నారు. "మేము 20 సంవత్సరాల క్రితం వైబ్రెంట్ గుజరాత్ అనే చిన్న విత్తనాన్ని నాటాము, నేడు అది పెద్ద వృక్షంగా అభివృద్ధి చెందింది" అని ప్రధాన మంత్రి అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన వారు గుజరాత్ అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టేవారని, అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు వైబ్రంట్ గుజరాత్‌కు రావడానికి నిరాకరించారు, విదేశీ పెట్టుబడిదారులను బెదిరించే వారని మోదీ చెప్పారు. అలా చాలా బెదిరింపుల తర్వాత విదేశీ పెట్టుబడిదారులు గుజరాత్‌కు వచ్చారని ప్రధాని మోదీ తెలిపారు.
Exploring the endless possibilities of the future with Robotics! pic.twitter.com/DYtvZN9CLC
— Narendra Modi (@narendramodi) September 27, 2023