కేసీఆర్ ప్లాన్ తోనే దాడులు

కేసీఆర్ ప్లాన్ తోనే దాడులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.  రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలని బండి సంజయ్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో  పర్యటిస్తుండగా  టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం దారుణమన్నారు.  భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలలో ప్రజా సమస్యల తెలుసుకోవడం కోసం పర్యటించిన సందర్భాలు ఉన్నాయన్న ఆయన... ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించడం ఇష్టంలేని టిఆర్ఎస్ పార్టీ దాడులకు పాల్పడడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులతో బీజేపీని భయపెట్టాలని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తుందన్నారు.  భారతీయ జనతా పార్టీ దాడులకు భయపడదు అన్న విషయం టీఆర్ఎస్ నేతలు  గ్రహించాలన్నారు.

బండి సంజయ్ పర్యటిస్తున్న ప్రాంతాలలో దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థలకు తెలియజేస్తామన్నారు.  30 రోజులుగా కల్లాల్లో, మార్కెట్లలో, వరి కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం అన్నారు. తమ బాధలను రైతులు రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పుకున్నారని..  రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన తీరు రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందన్న భావనతోనే దాడులు చేస్తున్నారన్నారు. దాడులకు పాల్పడడం సిగ్గుచేటని.. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రోద్బలంతోనే జరుగుతున్నాయన్నారు. భారతీయ జనతా పార్టీ అత్యవసరంగా రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నాయకుల సమావేశాన్ని రేపు సాయంత్రం 5గంటలకు జనగామలో నిర్వహిస్తున్నామని,, ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అధ్యక్షత వహిస్తారని చెప్పారు.