పాకిస్తాన్ లో గురునానక్‌ ప్యాలెస్‌ ధ్వంసం

పాకిస్తాన్ లో గురునానక్‌ ప్యాలెస్‌ ధ్వంసం

పాకిస్తాన్ లో గురునానక్‌ ప్యాలెస్‌ను కొందరు దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. పంజాబ్‌ ప్రావిన్సులో ఆ బిల్డింగ్ ఉంది. ఆ ప్యాలెస్‌లో సిక్కు మత వ్యవస్థాపకుడు గరునానక్‌తో పాటు కొందరు హిందూ రాజుల ఫొటో ఫ్రేమ్ లున్నాయి. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం ఆ భవంతిని నిర్మించి ఉంటారని అంచనా. ఆ అద్భుత క‌ట్ట‌డాన్ని చూసేందుకు ప్ర‌తి ఏడాది వేలాది మంది సిక్కు ప‌ర్యాట‌కులు అక్క‌డ‌కు వెళ్తారు. అయితే గురునాన‌క్ భ‌వ‌నంలో ఉన్న విలువైన కిటికీలు, డోర్ల‌ను కూడా అమ్ముకుంటున్నారట. ప్యాలెస్‌లో సుమారు 16 పెద్ద పెద్ద రూమ్‌లు ఉన్నాయి.