నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి నెల జీతం -విరాళం : గుత్తా సుఖేందర్ రెడ్డి

నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి నెల జీతం -విరాళం  : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి పిలుపు మేరకు తన నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇస్తానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలి సభ్యులందరూ నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి విరాళం ప్రకటించాలని కోరారు. శనివారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

 భారత్ యుద్ధనీతిని పాటిస్తూ పాకిస్తాన్​పై దాడులు చేసిందన్నారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలపైనే భారతదేశం దాడులు చేసిందని, కానీ పాకిస్తాన్ మాత్రం భారత పౌరులపై దాడి చేసిందని మండిపడ్డారు. పీవోకే స్వాధీనం చేసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని, ఈ సమయంలో భారత పౌరులు దేశానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. 

నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు నెల జీతం విరాళం

శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : భారత త్రివిధ దళాలకు మద్దతు తెలుపుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన నెల వేతనాని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.