
- సీఎంకు శాసనమండలి చైర్మన్ లేఖ
నల్గొండ అర్బన్, వెలుగు : ‘మన ఊరు.. -మన బడి’ కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి గురువారం లేఖ రాశారు. బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మన ఊరు..- మన బడి కార్యక్రమం కింద సివిల్ పనులు పూర్తయ్యాయని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ధృవీకరించారన్నారు.
ఈ కార్యక్రమం కింద పూర్తయిన సివిల్ పనులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.361.350 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అవసరాలను తీర్చిదిద్దారని తెలిపారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు.