సెల్ఫీ వీడియో తీసుకుని.. జిమ్ కోచ్ సూసైడ్

సెల్ఫీ వీడియో తీసుకుని.. జిమ్ కోచ్ సూసైడ్

జవహర్ నగర్, వెలుగు:  ఓ జిమ్ కోచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలాజీనగర్ పరిధి ఆనంద్ నగర్ కాలనీకి చెందిన జిమ్ కోచ్ రమేశ్ (43)  తొమ్మిదేండ్ల కిందట భార్యకు విడాకులు ఇచ్చాడు. అప్పటినుంచి అతడు సోదరుడి కుటుంబం వద్ద ఉంటున్నాడు.

కొంతకాలంగా తీవ్ర మనోవేదనతో ఉన్న రమేశ్​ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేనప్పుడు బెడ్రూమ్ లో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. జీవితంపై విరక్తితోనే తను సూసైడ్ చేసుకుంటున్నట్టు అతడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.