H1B వీసా ఫీజు పెంపుతో భారత టెక్కీలకు కష్టాలే.. మైక్రోసాఫ్ట్ కీలక వార్నింగ్..

H1B వీసా ఫీజు పెంపుతో భారత టెక్కీలకు కష్టాలే.. మైక్రోసాఫ్ట్ కీలక వార్నింగ్..

IT Employees: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఒకదాని తర్వాత మరొక షాక్ ఇస్తున్నారు ప్రపంచానికి. తాజాగా ఆయన హెచ్1బి వీసా ఫీజులను ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఈ విలువ దాదాపు రూ.85 లక్షల రూపాయలు. విదేశీయులు ఎక్కువగా ఈ వీసాల ద్వారా అమెరికాలోని హై పెయిడ్ జాబ్స్ చేస్తుంటారు. అయితే అమెరికన్లకు వీటి దుర్వినియోగం ఉపాధి అవకాశాలను తగ్గిస్తోందని భావిస్తున్న ట్రంప్ తాజా ప్రకటన చేశారు. 

వాస్తవానికి కొత్త రూల్స్ సెప్టెంబర్ 21 నుంచి ఏడాది పాటు అమలులోకి రాబోతున్నాయి. ఈ నిర్ణయం భారతదేశానికి, ఇండియన్ టెక్కీలకు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా ఇష్యూ చేసే మెుత్తం హెచ్1బి వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయులే పొందుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో ఉన్న భారతీయులు అలాగే టెక్ కంపెనీలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐటీ ఔట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్1బి వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని ఇది జాతీయ భద్రతకు ముప్పు అంటూ ట్రంప్ ప్రకటించారు. 

ట్రంప్ తీరుకున్న ఈ నిర్లక్ష్యపు నిర్ణయం ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి విదేశీ హై స్కిల్డ్ ఉద్యోగులు తెచ్చిన ఆవిష్కరణలు కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు మిలియన్ల మంది అమెరికన్లకు ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ కు చెందిన రాజ కృష్ణమూర్తి వెల్లడించారు. 

ALSO READ : H1B వీసా ఫీజు పెంపుపై..

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక..
ప్రస్తుతం సెలవుపై భారతదేశానికి వెళ్లిన తమ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సంస్థ అంతర్గత సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడైంది. సెప్టెంబర్ 21 తర్వాత వారిని అమెరికాలోకి ఎంటర్ కానివ్వకుండా అమెరికా నిరోధించే అవకాశం ఉందని, వీలైనంత తర్వగా తిరిగి రావాలని కోరింది. అలాగే ఇప్పటికే అమెరికాలో ఉన్న ఉద్యోగులను తమ ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవాలని సూచిస్తోంది. ట్రంప్ తెచ్చిన కొత్త చట్టం అములులోకి వచ్చేనాటికి అమెరికా గడ్డపై విదేశీ ఉద్యోగులు ఉండటం కొంత మెరుగని టెక్ దిగ్గజం సూచిస్తోంది.