హెచ్​1 బీ వీసా రెన్యూవల్ ఇక అమెరికాలోనే

హెచ్​1 బీ వీసా రెన్యూవల్ ఇక అమెరికాలోనే

వాషింగ్టన్: హెచ్1 బీ వీసా రెన్యూవల్ కోసం ఇండియాకు రావాల్సిన అవసరం లేకుండా అమెరికా చర్యలు చేపట్టింది. వీసా నిబంధనల్లో మార్పులు చేస్తూ అమెరికాలోనే ఈ వీసాలను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా 20 వేల హెచ్ 1 బీ వీసాలను రెన్యూవల్ చేసే ప్రక్రియకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియను అమలులోకి తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వీసా రెన్యూవల్​కు సంబంధించి విధివిధానాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదని, ఎవరు అర్హులనే విషయం ఫెడరల్ రిజిస్టర్ నోటీసు విడుదలయ్యాకే తెలుస్తుందని బ్లూమ్ బర్గ్ లా వెల్లడించింది. ఈ ప్రాసెస్ కు సంబంధించి వైట్ హౌస్ యంత్రాంగం తాజాగా చర్చించి ఆమోదం తెలిపింది. 

హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ కోసం వీసా హోల్డర్లు ఒక్క మెయిల్ చేస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. గతంలో వీసా రెన్యూవల్ కోసం హెచ్ 1 బీ హోల్డర్లు అమెరికా దాటి వెళ్లాల్సి వచ్చేది. గత  జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినపుడు ఈ వీసా రెన్యూవల్ కష్టాలను తప్పించేందుకు డొమెస్టిక్ రెన్యూవల్ పద్ధతిని తీసుకొస్తామని అమెరికా ప్రకటించింది.