డైజెషన్ సిస్టమ్ ని దెబ్బతీసే అలవాట్లు ఏంటంటే...

డైజెషన్ సిస్టమ్ ని దెబ్బతీసే అలవాట్లు ఏంటంటే...

మనం రోజుకి ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నాం. అన్న విషయంపై మన డైజెషన్ (జీర్ణక్రియ) పనితీరు ఆధారపడి ఉంటుంది. డైజెషన్ బాగుంటే షుగర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, బీపీ అదుపులో ఉంటాయి. బరువు కూడా తేలిగ్గా తగ్గొచ్చు. అందుకే జీర్ణక్రియని బూస్ట్ చేయడానికి టిప్స్, డైట్ ప్లాన్స్ ఫాలో అవుతుంటారు అంతా. మరి ఇవన్నీ 'ఓకే' కానీ, మెటబాలిజంని ఎఫెక్ట్ చేసే డైలీ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా విన్నారా! డైజెషన్ సిస్టమ్ ని దెబ్బతీసే ఆ అలవాట్లు ఏంటంటే...

• బరువు తగ్గాలంటే తక్కువ తినడం ఒక్కటే ఆప్షన్ అనే అపోహ చాలామందికి ఉంటుంది. అందుకే ఏవేవో డైట్ల పేరుతో తక్కువ క్యాలరీలున్న ఫుడ్ తింటుంటారు. ఇక్కడే ఉంది అసలు సమస్య. తినడమే తక్కువ తింటే.. కరిగించేందుకు క్యాలరీలు ఏం ఉంటాయి? ఆ ఎఫెక్టే జీర్ణక్రియపై పడి లేనిపోని తిప్పలు వస్తాయి. అందుకే ఏ డైట్ ఫాలో అవుతున్నా శరీరానికి సరిపడా క్యాలరీలు అందించాల్సిందే.
• క్యాలరీలు కరిగిస్తేనే మెటబాలిజం యాక్టివ్ ఉంటుంది. కానీ, ప్యాండెమిక్ వల్ల చాలామంది జిమ్ కెళ్లి వర్క్ అవుట్స్ చేయడం మానేశారు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ వల్ల ఎంప్లాయిస్ ఇల్లు దాటట్లేదు. ఆ ప్రభావం మెటబాలిజంపైనే బాగా పడుతోంది. అందుకే ఇకనుంచైనా క్యాలరీలు కరిగించడానికి కాస్త చెమటోడ్చాలి. నిలబడడం, ఎక్కడ ఇంటినింగ్ వంటివి చేయాలి. అంతెందుకు, వంట చేసికూడా క్యాలరీలు కరిగించుకోవచ్చు.
• హెల్దీగా బరువు తగ్గాలంటే మెటబాలిజంని బూస్ట్ చేయడానికి ప్రొటీన్ ఫుడ్ తినాలి. కానీ, చాలా మంది త్వరత్వరగా బరువు తగ్గాలని ప్రొటీన్ ఫుడ్ తక్కువ తింటారు. దానివల్ల నాలుగు మెట్లు ఎక్కినా వెంటనే అలిసిపోతారు. రోజంతా అలానే ఉండడం వల్ల క్యాలరీలు కరగవు. దాంతో డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. అలాగే జీర్ణ క్రియ తరువాత మెటబాలిజం పెరుగుతుంది. దాన్నే థర్మిక్ ఎఫెక్ట్ఫ్ ఫుడ్ అంటారు. ఒకవేళ ప్రొటీన్ ఫుడ్ తినకపోతే ఈ ప్రాసెస్కి ఇబ్బంది కలుగుతుంది. అదే రోజూ ప్రొటీన్ ఫుడ్ తింటే ఇరవై నుంచి ముప్పై శాతం మెటబాలిజం పెరుగుతుంది.
• కంటినిండా నిద్ర లేకపోతే బోలెడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. తక్కువ గంటలు పడుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, డిప్రెషన్తో పాటు మెటబాలిక్ రేటు తగ్గి బరువు పెరుగుతారు. సరిపడా నిద్రలేకపోవడం వల్లే కాదు టైంకి నిద్రపోకపోయినా మెటబాలిజం తగ్గుతుంది. అందుకే 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్లు రోజుకి ఏడుగంటలు నిద్రపోవాలి. 61 - 64 మధ్య వయసున్న వాళ్లు 7 నుంచి 9 గంటలు, అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్లు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

ALSO READ : గోవాలో రూ.100 మందు.. తెలంగాణలో రూ.246, కర్ణాటకలో రూ.500

• పప్పులు, ధాన్యాలు, వెజిటబుల్స్, బఠాణీలు, బీన్స్, బ్రెడ్లో ఉండే కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్కి పూర్తి డిఫరెంట్ ఉంటాయి రిఫైన్డ్ కార్బో హైడ్రేట్స్. ఇవి త్వరగా జీర్ణమై బ్లడ్ షుగర్ లెవల్స్ వెంటనే పెంచుతాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మన ఎనర్జీ సరిపోదు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న రిఫైన్డ్కర్బో హైడ్రేట్స్ తినడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. అందుకే రిఫైన్డ్ కార్బో హైడ్రేట్స్కీ బదులు కాంప్లెక్స్ కార్బో హైడ్రేటేనే తినాలి.
• చక్కెర శాతం ఎక్కువగా ఉండే డ్రింక్స్ వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్, ఒబెసిటీ లాంటి సమస్యలు వస్తాయి. వీటిల్లోని ఫ్రక్టోజ్ మెటబాలిక్ రేటును తగ్గిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.