ప్రపంచమంతా హమాస్‌‌ చట్టం తెస్తం.. హమాస్ కమాండర్‌‌‌‌ ప్రకటన

ప్రపంచమంతా హమాస్‌‌ చట్టం తెస్తం..  హమాస్ కమాండర్‌‌‌‌ ప్రకటన
  • ప్రపంచమంతా హమాస్‌‌ చట్టం తెస్తం
  • హమాస్ కమాండర్‌‌‌‌ మహమద్‌‌ అల్‌‌జహర్ ప్రకటన

గాజా : ఇజ్రాయెల్‌‌, పాలస్తీనాలోని హమాస్‌‌ టెర్రరిస్టుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మిలిటెంట్ల కమాండర్‌‌‌‌ కీలక ప్రకటన చేశారు. ప్రపంచం అంతా హమాస్‌‌ చట్టం కిందికి తీసుకొస్తామని కమాండర్‌‌‌‌ మహమద్‌‌ అల్‌‌జహర్‌‌‌‌ తెలిపారు. ఈ మేరకు నిమిషానికిపైగా నిడివి ఉన్న ఓ వీడియోను రిలీజ్‌‌ చేశారు. 

‘‘ఇజ్రాయెల్‌‌ మా మొదటి టార్గెట్‌‌ మాత్రమే. మా పోరాటాన్ని ప్రపంచమంతా విస్తరిస్తాం. ప్లానెట్‌‌ ఎర్త్ లో ఎలాంటి అన్యాయం, అణచివేత లేని వ్యవస్థ ఉండాలి. లెబనాన్‌‌, సిరియా, ఇరాక్‌‌ వంటి దేశాల్లో అరబ్‌‌లు, పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న హత్యలు, నేరాలు ఇంకెక్కడా జరగకూడదు” అని ఆ వీడియోలో మహమద్‌‌ అల్‌‌జహర్‌‌‌‌ పేర్కొన్నారు.