హమాస్​ మిలిటెంట్ల చేతిలో ఇజ్రాయెల్ చిన్నారులు

హమాస్​ మిలిటెంట్ల చేతిలో ఇజ్రాయెల్ చిన్నారులు

ఇజ్రాయెల్​, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన పౌరులు వందల మంది హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నారు. వారిలో చిన్నపిల్లలు, వృద్ధులు, పలువురు సైనికులు కూడా ఉన్నారు. బందీలుగా ఉన్న తమ వారిని ఏం చేస్తారోనని ఇజ్రాయిల్ ప్రభుత్వం భయాందోళనలో ఉంది. ఓవైపు హమాస్ మిలిటెంట్లపై యుద్ధం చేస్తూనే తమ వారిని రక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. 

తాజాగా హ‌మాస్ సాయుధులు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇజ్రాయిల్ ప్ర‌జ‌లను బందీ చేసిన ఆ వ్య‌క్తులు.. వారి చెర‌లో ఉన్న చిన్నారుల వీడియోను విడుదల చేశారు. టెలిగ్రాం యాప్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు. త‌మ వ‌ద్ద ఉన్న పిల్ల‌లను తాము బాగానే చూసుకుంటున్నామ‌న్న సందేశాన్ని ఇచ్చేందుకు గాజా స్ట్రిప్‌లో ఉన్న సాయుధులు ఈ వీడియోను రిలీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఓ చిన్నారిని తోపుడు బండిలో ఉంచి ఆడిస్తున్నారు. మ‌రో చిన్నారిని చేతుల్లో ఎత్తుకుని తిప్పుతున్నారు. హ‌మాస్ ఉగ్ర‌వాదులు త‌మ చేతుల్లో ఏకే రైఫిళ్ల‌ను ప‌ట్టుకునే.. పిల్ల‌ల్ని ఆడిస్తున్న వీడియో ట్రెండ్ అవుతోంది. మిలిట‌రీ దుస్తుల‌తో ఏకే సిరీస్ రైఫిల్‌తో ఉన్న ఓ వ్య‌క్తి త‌న భుజాల‌పై ఓ చిన్నారిని ఎత్తుకున్నాడు. ఇక తోపుడు బండిలో ఏడుస్తున్న మ‌రో చిన్నారిని బుజ్జ‌గించేందుకు ఓ సాయుధుడు ప్ర‌య‌త్నించాడు. పిల్ల‌ల‌తోటి బిస్మిల్లా అనిపిస్తూ వాళ్ల‌కు నీళ్లు తాగిస్తున్నారు.