
వరంగల్ అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన 9 నెలల పాపపై ఆత్యాచారం, హత్య కేసు విచారణ ఇవాళ వరంగల్ కోర్టులో ప్రారంభమైంది. నిందితుడు పోలేపాక ప్రశాంత్ ను వరంగల్ సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు.
జూన్ 19న హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేశాడు నిందితుడు ప్రశాంత్. అర్ధరాత్రి తల్లిదండ్రులతోపాటు డాబాపై పడుకున్న 9నెలల చిన్నారిని ఎత్తుకుపోయాడు నిందితుడు. దూరంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి పక్కన లేకపోవడంతో… తల్లిదండ్రులు చుట్టుపక్కల తిరిగి చూడటంతో నిందితుడి దారుణం కంటపడింది. నిందితుడిపై దాడిచేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. పాప ప్రాణాలు కోల్పోయింది.