
అల్లు అర్జున్ ( Allu Arjun ) 'దేశముదురు' మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి సినీ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వాని ( Hansika Motwani ). తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తన వివాహబంధంపై వస్తున్న పుకార్లతో వార్తల్లో లెకెక్కింది. భర్త సోహైల్ ఖతురియాతో విడుకాలు తీసుకోబోతున్నరంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
హన్సిక మోత్వాని, సోహైల్ ఖతురియా ( Sohael Khaturiya )2022 డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వారి వివాహం అప్పట్లో సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించింది. సోహైల్ హన్సిక వ్యాపార భాగస్వామి, చాలా కాలంగా స్నేహితులు. వారిద్దరి స్నేహం ప్రేమగా మారి, వివాహ బంధానికి దారితీసింది. సోహైల్ హన్సికకు పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:-హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు : రూ.600 ప్లస్ GST
అయితే గత కొంత కాలంగా హన్సిక , సోహైల్ విడివిడిగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి. దీనిపై సోహైల్ ఓ ఇంటర్యూలో క్లారిటీ ,ఇచ్చారు. విడాకుల పుకార్లను కొట్టిపారేశారు. కానీ హన్సికాతో విడివిడిగా ఉంటునారన్న పుకార్లపై మాత్రం మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం నటి హన్సిక తన తల్లితో కలిసి ఉంటోంది. అదేవిధంగా భర్త సోహైల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో ఆమె సోహైల్ కుటుంబంతో కలిసి ఉండేవారు. అయితే వారిది పెద్ద కుటుంబం కావడంతో సర్దుకుపోవడంలో కొంత సమస్యగా ఉండటంతో .. హన్సిక అదే భవనంలోని ఒక అపార్ట్ మెంట్ కు మారినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని సమాచారం.
హన్సిక , సోహైల్ ల వివాహం 'లవ్ షాదీ డ్రామా' అనే డిస్నీ+ హాట్‌స్టార్ డాక్యుమెంటరీ సిరీస్‌గా కూడా వచ్చింది, ఇది వారి వివాహ ప్రణాళికలు, సవాళ్లు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన కొన్ని నాటకీయ సన్నివేశాలను చూపించింది. ఈ డాక్యుమెంటరీ వారి వ్యక్తిగత జీవితాన్ని దగ్గరగా చూపించినప్పటికీ, ఇప్పుడు వస్తున్న విడాకుల పుకార్లు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే హన్సిక మాత్రం ఇప్పటివరకు విడాకులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కెరీర్ పరంగా హన్సిక నాలుగు తమిళం, హిందీ భాషల్లో నటిస్తుంది. మరి విడాకులు తీసుకోతున్నట్లు వస్తున్న వార్తలపై ఈ అమ్మడు ఎలా స్పందిస్తారో చూడాలి.