
దేశముదురు హీరోయిన్ హన్సిక మోత్వానీ షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడంటూ సంచలన విషయాన్ని చెప్పింది. తనతో డేట్‌కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని వేధించే వాడని తెలిపింది. ఆ టార్చర్భరించలేక ఆ హీరోకి తగిన విధంగా బుద్ధి చెప్పినట్టు పేర్కొంది. అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. దీంతో హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారని.. నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది.
ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న హాన్సిక అక్కడే సెటిలైంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మడు సినిమా అవకాశాలు అందుకుంటోంది. కోలీవుడ్ లోనూ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హాన్సికకు తెలుగు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు వచ్చాయి. టాప్ హీరోలందరితో హన్సిక నటించింది. తెలుగులో కంటే తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో ఆడిపాడింది.
తమిళంలోనూ పెద్ద హీరోల సరసన నటించి..మంచి పేరును తెచ్చుకుంది. దీంతో అక్కడ హాన్సికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టారంటే..తమిళంలో హాన్సికకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళంలోనే కాదు..తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ..సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది హన్సిక.