హనుమకొండ/ హనుమకొండ సిటీ, వెలుగు: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. లారీలు, గోనె సంచులు, కొనుగోళ్ల ప్రక్రియ మానిటరింగ్, తదితర సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం నెంబర్ 73307 51364 ను సంప్రదించవచ్చని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందని చెప్పారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి అధికారులకు విధులు కేటాయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నగర అభివృద్ధికి నిధులు లేవని, బాలసముద్రంలోని రెండున్నర ఎకరాల భూమిని వేలం వేసేందుకు కుడా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోఆలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐయూ, ఆర్ఎస్పీ పార్టీల జిల్లా కార్యదర్శులు జి.ప్రభాకర్‌రెడ్డి, కర్రె భిక్షపతి, ఎన్రెడ్డి హంసరెడ్డి, కౌడగాని శివాజీ తదితరులు కలెక్టర్ స్నేహ శబరీశ్కు వినతి పత్రం అందజేశారు.
