
కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో సోమశిల మల్లేశ్వరం క్రాస్ రోడ్డులో వెలసిన శ్రీ అభయ అరణ్య వీరాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు గురువారం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
నారాయణపేట, వెలుగు: నారాయణపేట పట్టణంలోని లక్ష్మి గణపతి దేవాలయంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు విద్యాధర్ దీక్షిత్ మంత్రోచ్చరణాలతో గణపతి పూజ, జలాదివాసం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
వనపర్తి, వెలుగు: హనుమాన్ జన్మదినాని గురువారం వనపర్తి ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దంపతులు పలు హనుమాన్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు
పాల్గొన్నారు.