హనుమత్​ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...

హనుమత్​ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...



వాస్తు ప్రకారం దేవుళ్ళు, దేవతల విగ్రహాలను ఇంట్లో ప్రతిష్టించడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుందని నమ్ముతారు. హనుమంతుడి విగ్రహం ఏ దిశలో ఉండాలని విషయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే వాస్తు లోపాల వల్ల వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి విగ్రహాన్ని ఏ దిశలో పెడితే  ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి  ఫోటోను ఇంట్లో  పెట్టుకున్నారంటే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఈ ఏడాది (2024) హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మీరు  ఇంట్లో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే వాస్తుకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

  • వాస్తు ప్రకారం హనుమంతుడి విగ్రహం లేదా చిత్రాన్ని పూజ గదిలో దక్షిణ దిశలో ఉంచాలి. ఈ దిశలో ఫోటో పెట్టేటప్పుడు హనుమాన్ కూర్చున్న భంగిమలో ఉన్న ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. 
  • వాస్తు ప్రకారం పడక గదిలో హనుమంతుడి ఫోటో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది. అందుకే పొరపాటున కూడా హనుమంతుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పడకగదిలో ఉంచుకోకూడదు. ఎందుకంటే హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. 
  • వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పూజిస్తూ మంగళవారం సుందరకాండ పారాయణం చేయాలి. అప్పుడే మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి.
  • ఇంట్లోని చీడ,పీడలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఇంటి దక్షిణ దిశ గోడపై కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి చిత్రపటాన్ని తగిలించుకోవచ్చు. ఈ చిత్రపటంలో హనుమంతుడు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలి. 
  • వాస్తు నిపుణుల సూచనల ప్రకారం మెట్ల కింద, వంట గదిలో హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచకూడదు. అలా చేశారంటే అది సమస్యలను తీసుకొస్తుంది. 
  • శత్రువులు, గృహ బాధలు, సంబంధాల్లో విభేదాలు, కుటుంబంలో ప్రతికూలతలు నివారించేందుకు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి.  పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ప్రధాన ద్వారంపైన ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంటి నుండి దూరంగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
  • ఇంట్లోనే డ్రాయింగ్ రూమ్ లో శ్రీరామ దర్బార్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. వీటితోపాటు పంచముఖ ఆంజనేయస్వామి, హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్న ఫోటోను కూడా ఈ గదిలో ఉంచుకోవచ్చు. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 
  • ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కోసం హనుమంతుడి బొమ్మను ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే హనుమంతుని శరీరంపై తెల్ల వెంట్రుకలు ఉన్న ఫోటో ఎంచుకుంటే మరీ మంచిది. 
  • హనుమంతుడిని పూజించడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఈరోజు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. హనుమంతుడికి నీరు సమర్పించిన  తర్వాత పంచామృతాన్ని నైవేద్యంగా పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
  • నువ్వుల నూనెలో నారింజ ..పచ్చిమిర్చి కలిపి నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. హనుమత్​ జయంతి ( ఏప్రిల్​ 23) రోజున ఆంజనేయస్వామికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించాలి. అంతే కాకుండా బెల్లం లేదా గోధుమపిండితో చేసిన రోటి సుర్మాను  నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల భజరంగబలి సంతోషించి భక్తులకు సుఖసంతోషాలతో ప్రసాదిస్తాడని నమ్ముతారు.