
గద్వాలలోని కృష్ణానదిలో హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీపావళి అమావాస్య సందర్భంగా నదికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. నది ఒడ్డున ఉన్న స్పటిక లింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామికి భక్తులు పూజలు చేశారు.