గురుగ్రంథ్ సాహిబ్ లను మోసిన జేపీ నడ్డా

గురుగ్రంథ్ సాహిబ్ లను మోసిన జేపీ నడ్డా

అఫ్ఘనిస్తాన్ నుంచి కొందరు సిక్కులు ఢిల్లీ వచ్చారు. ఆపరేషన్ దేవీ శక్తి కార్యక్రమంలో భాగంగా... సిక్కు ప్రతినిధులు కాబూల్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ చేరుకున్నారు. తమతో పాటు సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ లను కూడా తీసుకొచ్చారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నారు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా. విమానం దగ్గరకు వెళ్లి గురుగ్రంథ్ సాహిబ్ లను మోసుకొచ్చారు నడ్డా, హర్ దీప్ సింగ్ పురి. ఎయిర్ పోర్ట్ లోని ఓ ఛాంబర్ వరకు వాటిని తీసుకెళ్లారు.