జాస్మిన్ కాదు.. మహికా.. ఎట్టకేలకు కొత్త గర్ల్ ఫ్రెండ్‎ను పరిచయం చేసిన పాండ్యా

జాస్మిన్ కాదు.. మహికా.. ఎట్టకేలకు కొత్త గర్ల్ ఫ్రెండ్‎ను పరిచయం చేసిన పాండ్యా

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఎట్టకేలకు తన కొత్త గర్ల్ ఫ్రెండ్‎ను అభిమానులకు పరిచయం చేశాడు. సెర్బియా మోడల్ నటాషాను హార్ధిక్ పాండ్యా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వ్యక్తిగత కారణలతో పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారు. నటాషాకు డివోర్స్ ఇచ్చిన తర్వాత మోడల్ జాస్మిన్ వాలియాతో కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు పాండ్యా. 

దీంతో వీరిద్దరూ డేటింగ్‎లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అటు జాస్మిన్ కానీ.. ఇటు హార్దిక్ కానీ అధికారిక ప్రకటన చేయలేదు. పాండ్యా, జాస్మిన్ రిలేషన్ షిప్‎పై ఎటువంటి అఫిషియల్ అనౌన్స్‎మెంట్ రాకముందే వీరిద్దరూ విడిపోయారని.. పాండ్యా మరో మోడల్‎తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా దీనిపై హార్ధిక్ క్లారిటీ ఇచ్చాడు. 

తన గర్ల్ ఫ్రెండ్ ఎవరనే సస్పెన్‎కు తెరదించాడు. తాను మోడల్ మహికా శర్మతో డేటింగ్‎లో ఉన్నట్లు అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు హార్ధిక్. ఈ మేరకు మహికాతో కలిసి ఉన్న ఫొటోలను శుక్రవారం (అక్టోబర్ 10) ఇన్స్‎స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు. తన బర్త్ డే (అక్టోబర్ 11) వేడుకలను ఒక రోజు ముందుగానే (అక్టోబర్ 10) ప్రియురాలు మహికాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు హార్ధిక్. 

ఈ మేరకు ప్రేయసితో చిల్ అవుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో హార్ధిక్, మహికా డేటింగ్‎లో ఉన్నట్లు అఫిషియల్‎గా కన్ఫామ్ అయ్యింది. పాండ్యా తన ప్రియురాలను పరిచయంతో చేయడంతో అసలేవరీ మహికా శర్మ అంటూ సెర్చ్ చేస్తున్నారు హార్ధిక్ అభిమానులు.

ఇంతకీ ఎవరీ మహికా శర్మ..?

27 ఏళ్ల మహికా శర్మ ఢిల్లీకి చెందిన అమ్మాయి. హార్ధిక్ పాండ్యా కంటే ఏడేళ్లు చిన్నది. ఆర్ధిక శాస్త్రం, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటర్న్‌గా కొన్ని కంపెనీల్లో వర్క్ చేసింది. మోడలింగ్‌పై ఇష్టంతో ఈ రంగంలోకి దిగి కొన్ని యాడ్స్‎లో నటించింది.

►ALSO READ | చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండో ప్లేయర్‎గా అరుదైన ఘనత

ర్యాపర్ రాజాతో కలిసి ఓ వీడియో సాంగ్‌ చేసి గుర్తింపు దక్కించుకుంది. అలాగే.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ‘పీఎం నరేంద్ర మోడీ’ బయోపిక్‎లో కూడా ఒక పాత్ర పోషించింది. 2024 ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో మోడల్ ఆఫ్ ద ఇయర్ (న్యూ ఏజ్) అవార్డు గెలిచింది మహికా శర్మ.