
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో భారీ సెంచరీ (173)తో కదం తొక్కిన స్టార్ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అతిచిన్న వయస్సు (23 ఏళ్లు)లోనే టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక (5) సార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. జైశ్వాల్ 23 ఏళ్ల వయసులో 5 సార్లు 150 ప్లస్ స్కోర్ చేశాడు. జైశ్వాల్ కంటే ముందు ఈ రికార్డ్ ఆసీస్ దిగ్గజం సర్ బ్రాడ్ మాన్ పేరిట ఉంది.
బ్రాడ్ మాన్ 23 ఏళ్ల వయసులో 8 సార్లు 150 ప్లస్ స్కోర్ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాత 5 సార్లు 150 స్కోర్ చేసి జైశ్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. తద్వారా148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మాన్ మాత్రమే సాధించిన ఘనతను యశస్వి జైస్వాల్ సాధించడం ద్వారా పుస్తకాలలో తన పేరును లిఖించుకున్నాడు.
కాగా, టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో యశస్వి జైశ్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. 253 బంతుల్లో 173 పరుగులు చేసి ద్విశతకానికి చేరువలో ఉన్నాడు. 22 ఫోర్లతో విండీస్ బౌలర్లపై జైశ్వాల్ విరుచుకుపడ్డాడు. జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ కెరీర్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. ఇందులో 5 సెంచరీలు 150 ప్లస్ స్కోర్ కావడం మరో హెలైట్.
►ALSO READ | IND vs WI: డబుల్ సెంచరీకి చేరువలో జైశ్వాల్.. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా టీమిండియా
ఇక.. జైశ్వాల్ చెలరేగడంతో వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్టుల్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. తొ లి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్ (173), కెప్టెన్ శుభమన్ గిల్ (20) ఉన్నారు. చేతిలో మరో 8 వికెట్లు ఉండటంతో ఫస్ట్ ఇన్సింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.
23 ఏళ్ల వయసులో అత్యధికంగా 150+ నాక్‌లు చేసిన ఆటగాళ్ళు
- డాన్ బ్రాడ్‌మాన్ 8 సార్లు
- యశస్వి జైస్వాల్ 5 సార్లు
- జావేద్ మియానంద్ 4 సార్లు
- గ్రేమ్ స్మిత్ 4 సార్లు
- సచిన్ టెండూల్కర్ 4 సార్లు