
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (173 నాటౌట్) భారీ సెంచరీతో కదం తొక్కగా.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్ (38) రాణించడంతో తొలి రోజు పూర్తిగా టీమిండియానే అధిపత్యం ప్రదర్శించింది. టీమిండియ బ్యాటర్ల దెబ్బకు వెస్టిండీస్ బౌలర్లు తేలిపోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్ (173), కెప్టెన్ శుభమన్ గిల్ (20) ఉన్నారు.
ఢిల్లీ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్స్ యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్ వెస్టిండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఐదు ఫోర్లు, ఒక సిక్సు కొట్టి జోరుమీదున్న కేఎల్ రాహుల్ 38 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. వారికన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ రూపంలో పెవిలియన్ చేరాడు. రాహుల్ నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ యశస్వీ జైశ్వాల్‌తో జతకట్టి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
►ALSO READ | ఐపీఎల్ 2026 వేలానికి ముహుర్తం ఫిక్స్.. ఫ్రాంచైజ్‌లకు డైడ్ లైన్ విధించిన BCCI..!
ఈ క్రమంలో సాయి సుదర్శన్ 87 పరుగుల వద్ద ఔట్ కావడంతో సెంచరీ మిస్ అయ్యింది. సాయి సుదర్శన్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్, సెంచరీతో ఊపుమీదున్న జైశ్వాల్ మరో వికెట్ పడకుండా తొలిరోజును ముగించారు. వెస్టిండిస్ బౌలర్లలో జోమెల్ వారికన్కే రెండు వికెట్లు దక్కాయి. దీంతో తొ లి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్ (173), కెప్టెన్ శుభమన్ గిల్ (20) ఉన్నారు. చేతిలో మరో 8 వికెట్లు ఉండటంతో ఫస్ట్ ఇన్సింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.