ఐపీఎల్ 2026 వేలానికి ముహుర్తం ఫిక్స్.. ఫ్రాంచైజ్‎లకు డైడ్ లైన్ విధించిన BCCI..!

 ఐపీఎల్ 2026 వేలానికి ముహుర్తం ఫిక్స్.. ఫ్రాంచైజ్‎లకు డైడ్ లైన్ విధించిన BCCI..!

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ మ్యాచులకు ఎంత క్రేజ్ ఉంటుందో ఐపీఎల్ ఆక్షన్‎కు కూడా అంతే క్రేజ్ ఉంటుందనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఏ ప్రాంచైజ్ ఏ ఆటగాడిని కొనుగోలు చేస్తుంది..? అత్యధిక ధరకు ఏ ప్లేయర్ జాక్ పాట్ కొడతాడనే దానిపై క్రికెట్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ వేలం తేదీలు ఖరారైనట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

2025, డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 13-15 తేదీల్లో ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ డేట్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే.. ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీపైన ఐపీఎల్ ప్రాంచైజ్‎లకు బీసీసీఐ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. 2025 నవంబర్ 15వ తేదీ లోగా ఐపీఎల్ ఫ్రాంచైజ్‎లు ప్రస్తుతం తమ దగ్గర ఉన్న ఆటగాళ్ల వివరాలు, రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వదిలేస్తున్న క్రికెటర్ల వివరాలను అందజేయాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. 

►ALSO READ | IND vs WI 2nd Test: సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్.. సాయి సుదర్శన్ కూడా కుమ్మేస్తున్నాడు

ఈ తేదీ లోగా యాజమాన్యాలు వివరాలు అందజేస్తే.. బీసీసీఐ వేలం కసరత్తు మొదలుపెట్టనుంది. ఈ సారి జరిగేది మినీ వేలం కావడంతో జట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెన్నై సూపర్స్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లలో మాత్రం భారీ మార్పులు చేర్పులు జరగొచ్చని సమాచారం. అయితే.. బీసీసీఐ మాత్రం ఐపీఎల్ వేలం తేదీలు, వేదిక గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ఐపీఎల్ ఆక్షన్ షెడ్యూల్ గురించి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‎మెంట్ చేయలేదు. గత రెండు సీజన్ల ఐపీఎల్ వేలం విదేశాల్లో జరిగిన విషయం తెలిసిందే. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఐపీఎల్ ఆక్షన్ ఇండియాలోనే జరగనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ ఏడాది వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు టాక్.