IND vs WI 2nd Test: సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్.. సాయి సుదర్శన్ కూడా కుమ్మేస్తున్నాడు

IND vs WI 2nd Test: సెంచరీతో అదరగొట్టిన జైశ్వాల్.. సాయి సుదర్శన్ కూడా కుమ్మేస్తున్నాడు

టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో యశస్వి జైశ్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. 145 బంతుల్లో 101 పరుగులు చేసి ‘శతక’బాదాడు. 16 ఫోర్లతో విండీస్ బౌలర్లపై జైశ్వాల్ విరుచుకుపడ్డాడు. జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ కెరీర్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. 

టెస్ట్ క్రికెట్లో 24 ఏళ్ల వయసులోనే ఏడు సెంచరీలు చేసిన కుర్రాడిగా యశస్వి జైశ్వాల్ సత్తా చాటాడు. సాయి సుదర్శన్ కూడా 132 బంతుల్లో 71 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడుతున్నాడు. ఈ ఇద్దరి భారీ భాగస్వామ్యంతో 58 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది.

ALSO READ : రాహుల్ వికెట్ తో టీం ఇండియా డీలా..

కెఎల్ రాహుల్ 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌  పాయింట్ల పట్టికలో పట్టును పెంచుకోవాలని భావిస్తోంది. అలాగే ఈ ఏడాది చివర్లో సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే కఠినమైన సిరీస్‌‌‌‌కు కావాల్సినంత ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుకోవాలని యంగ్‌‌‌‌ టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. 

వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో టీమిండియా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ అంత లోతుగా ఏ జట్టుది లేదు. గత ఏడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఆరింటిలో ఫెయిలైన సాయి సుదర్శన్‌‌‌‌ గురించి సెలెక్టర్లు, కోచ్‌‌‌‌ పెద్దగా ఆందోళన చెందలేదు. ఏదో ఓ రోజు తన సత్తా చూపెడతాడని నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని సాయి సుదర్శన్ ఈ మ్యాచ్తో నిజం చేశాడు.