ఎన్‌‌సీఏకు హార్దిక్‌‌ పాండ్యా

ఎన్‌‌సీఏకు హార్దిక్‌‌ పాండ్యా

ముంబై:  టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫెయిల్యూర్‌‌ తర్వాత  న్యూజిలాండ్​తో సిరీస్​కు దూరమైన హార్దిక్​ పాండ్యాను బెంగళూరులోని నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ (ఎన్‌‌సీఏ)లో జాయిన్‌‌ అవ్వాలని  బీసీసీఐతో పాటు సెలక్టర్లు ఆదేశించారు.  బ్యాక్‌‌ ఇంజ్యురీ నుంచి కోలుకున్న పాండ్యా.. ఎన్‌‌సీఏలో ఫిట్‌‌నెస్‌‌ ప్రూవ్‌‌ చేసుకుంటేనే  వచ్చే నెలలో సౌతాఫ్రికా టూర్‌‌కు కన్సిడర్‌‌ చేస్తారని సమాచారం. ఒకవేళ ఫిట్‌‌నెస్‌‌ టెస్టు పాసైనా కూడా పాండ్యాను లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌ కోసమే సౌతాఫ్రికా తీసుకెళ్లే చాన్సుంది. ప్రస్తుతానికైతే అతడిని టెస్టులకు కన్సిడర్‌‌ చేసే అవకాశం లేదు. టెస్ట్‌‌ క్రికెట్‌‌కు అవసరమైన ఫిట్‌‌నెస్‌‌ లెవెల్‌‌కు పాండ్యా ఇప్పుడు  దరిదాపుల్లో కూడా లేకపోవడమే అందుకు కారణమని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇక,  డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో ఆడి తిరిగి నేషనల్‌‌ టీమ్‌‌లోకి రావాలని ప్లేయర్లను కొత్త కోచ్‌‌ ద్రవిడ్‌‌ ఆదేశించే అవకాశం ఉంది. అయినప్పటికీ వచ్చే నెలలో జరిగే విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీలో హార్దిక్‌‌ బరిలోకి దిగే చాన్స్‌‌ లేదు. పూర్తి ఫిట్‌‌నెస్‌‌ లేనందున ఈ టోర్నీలో ఆడితే పాండ్యా  మళ్లీ గాయపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టోర్నీ జరిగే టైమ్‌‌లో పాండ్యా ఎన్‌‌సీఏలో తన రిహాబిలిటేషన్‌‌ను పూర్తి చేయనున్నాడు.