
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఊబ చెరువు సుందరీకరణ పనులను హరీష్ రావు ప్రారంభించారు. కొందరు నేతలు గాంధీ భవన్, బీజేపీ ఆఫీసులో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు హరీష్. సదాశివపేటలో 20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల్లో 6 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవని, ఇప్పుడు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు.