ప్రిన్స్ హ్యారీకి ఇదే లాస్ట్ అఫిషియల్ ప్రోగ్రామ్

ప్రిన్స్ హ్యారీకి ఇదే లాస్ట్ అఫిషియల్ ప్రోగ్రామ్

బ్రిటన్బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ నుంచి తప్పుకుంటామని ప్రకటించిన తర్వాత ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మెగన్‌ మార్కెల్ మొదటిసారి గురువారం అధికారిక కార్యక్రమంలో కనిపించారు. దేశ సేవలో గాయపడిన సిబ్బందికి అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. రాయల్ ఫ్యామిలీ మెంబర్లుగా వారికి ఇదే చివరి అధికారిక కార్యక్రమం కానున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఫ్యామిలీ నుంచి వేరుపడుతున్నట్లు వారు ఇదివరకే ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి  ప్రిన్స్ హ్యారీ, మెగన్‌ తమ రాయల్ డ్యూటీలను నిలిపివేస్తామని తెలిపారు. తాము ఆర్థికంగా ఇండిపెండెంట్ గా ఉండాలని, కెనడాలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయినట్లువెల్లడించారు.

ఈ నెల 31న ఎగ్జిట్

కింగ్​హోమ్ ప్యాలెస్​తో సుదీర్ఘ చర్చల తర్వాత రాయల్ డ్యూటీస్ నుంచి తప్పుకుంటున్నట్లు హ్యరీ కపుల్ ప్రకటన చేసింది. ‘‘డ్యూక్, డచెస్ ఆఫ్ ససెక్స్.. సీనియర్ రాయల్స్ పదవుల నుంచి మార్చి 31న అధికారికంగా తప్పుకుంటారు” అని వారి స్పోక్స్​పర్సన్ మీడియాకు తెలిపారు. దీంతో ఇకపై హ్యారీ, మెగన్‌​కు లండన్​లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఆఫీసు ఉండదు. వారు ఏప్రిల్ 1 నుండి క్వీన్ ఎలిజబెత్ II కోసం అధికారిక రాయల్ డ్యూటీలు చేయరు. తనకున్న ‘మేజర్, లెఫ్టినెంట్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్’ సైనిక ర్యాంకులను హ్యారీ వదులుకుంటారు. గౌరవ సైనిక పదవులను ఉపయోగించేందుకు వీలు ఉండదు. ఆ హోదాలతో సంబంధం ఉన్న అధికారిక డ్యూటీలను నిర్వహించరు. హ్యారీ, మేఘన్​లకు ఇచ్చిన హిజ్, హర్ రాయల్ హైనెస్ టైటిల్స్ కొనసాగినప్పటికీ వారు ఏ దేశంలోనూ వాటిని ఉపయోగించేందుకు వీలు లేదు. అఫీషియల్ గా రాయల్ డ్యూటీల నుంచి ఎగ్జిట్ డీల్ ఇప్పటికే కుదిరింది. హ్యారీ, మెగన్‌ సంతకాలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ డీల్​అమలులోకి రానుంది.

డబ్బులు కట్టేస్తరు

రాయల్ ఫ్యామిలీ నుంచి విడిపోయాక ప్రిన్స్ హ్యారీ ప్రత్యేకంగా కట్టించుకున్న ఫ్రాగ్​మోర్​ కాటేజీకి అయిన ఖర్చును తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పారు. దాని కోసం ఖర్చు చేసిన రూ.22.19 కోట్ల (24 లక్షల బ్రిటన్​ పౌండ్లు)తో పాటు, వాళ్లు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులకు కమర్షియల్​ రెంట్​ (కిరాయి) సుమారు రూ.3.32 కోట్లు (3.6 లక్షల పౌండ్లు ఏడాదికి) చెల్లించేందుకు హ్యారీ, మేఘన్ లు  రెడీ అయ్యారు. రాయల్​ ఫ్యామిలీ నుంచి బయటికొచ్చినా ఎక్కడా క్వీన్​ గౌరవానికి భంగం కలగకుండా మసులుకుంటామని వాళ్లిద్దరు హామీ ఇచ్చారు.