
హాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. హ్యారీ పోర్టర్, క్యారీ ఆన్ చిత్రాల్లో ప్రముఖ పాత్ర పోషించిన బ్రిటీష్ నటుడు లెస్లీ ఫిలిప్స్(98) అనారోగ్యంతో కన్నుమూశారు.హ్యారీ పోర్టర్ సినిమాలో లెస్లీ నటించిన పాత్రకు మంచిపేరు వచ్చింది. 80 సంవత్సరాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో... 200లకు పైగా చలనచిత్రాల్లో ఆయన నటించారు. అలాగే.. టీవీ, రేడియో సిరీస్ లలో కూడా లెస్లీ నటించారు. ఇక లెస్లీ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
లెస్లీ ఫిలిప్స్1924లో జన్మించారు. తన విలక్షణమైన స్వరంతో సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. డింగ్ డాంగ్, హీల్లో వంటి చిత్రాల కారణంగా యూకే, యూస్‌లో బాగా పేరు పొందారు. క్యారీ ఆన్ టీచర్, క్యారీ ఆన్ కొలంబస్, క్యారీ ఆన్ నర్స్ వంటి సినిమాల్లో ఆయన నటించారు. 2001లో వచ్చిన లారా క్రాప్ట్: టోంబ్ రైడర్లో ఏంజెలీనా జోలీతో కలిసి లెస్లీ నటించారు. డాక్టర్ సిరీస్‌తో ఫిలిప్స్ ప్రదర్శన ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ప్రముఖ రేడియో ప్రోగ్రామ్ ది నేవి లార్క్లో 17 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు. 2006 'వీనస్'లో పీటర్ ఓ'టూల్‌తో కలిసి అతని సహాయక నటనకు బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. అదనంగా, అతను స్టీవెన్ స్పీల్‌బర్గ్ 'ఎంపైర్ ఆఫ్ ది సన్'.. సిడ్నీ పొలాక్ 'అవుట్ ఆఫ్ ఆఫ్రికా' వంటి సినిమాలలో అతిధి పాత్రలు పోషించారు.