‘హ్యారీపోటర్‌’ నటుడు కన్నుమూత

‘హ్యారీపోటర్‌’ నటుడు కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్  నటుడు, హ్యీరీపోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ (56) కన్నుమూశారు. లండన్‌లోని యాస్టర్‌ రోడ్‌ సెయింట్‌ పాంక్రస్‌రైల్వే స్టేషన్ సమీపంలో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.  4 అంగుళాల పొడవు ఉన్న ఈ నటుడు విల్లో, లైబరన్స్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హ్యారీ పాటర్,  స్టార్ వార్స్ చిత్రాలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. స్పాండిలోపిఫినల్ డైస్పాల్షియా కాంజెనిటల్అనే జెనిటిక్ డిజార్డర్ కారణంతో మరుగుజ్జులా ఉండిపోయారు.  ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి.  ఆయన మృతిపై పలువురు హాలీవుడ్‌ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.