Sundaram Master Day 1 Collections: సుంద‌రం మాస్ట‌ర్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్..ఎంత వచ్చాయంటే?

Sundaram Master Day 1 Collections: సుంద‌రం మాస్ట‌ర్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్..ఎంత వచ్చాయంటే?

యూట్యూబర్గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హర్ష చెముడు(Harsha Chemudu) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ సుందరం మాస్టర్‌(Sundaram Master). కళ్యాణ్ సంతోష్(Kalyan Santosh) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మహారాజ్ రవితేజ, శ్వేత, సుధీర్, హేమంత్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ టాక్ తోనే  పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.వైవా హ‌ర్ష త‌న కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.దీంతో ఈ సినిమా ఫస్ట్ డే కల్లెక్షన్స్ ఎంత వచ్చాయనే ఇంట్రెస్ట్ ఆడియన్స్లో ఉండటంతో..తాజాగా మేకర్స్ ప్రకటించారు.

సుంద‌రం మాస్ట‌ర్ మూవీకి ఫస్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 2.03 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రూ.90 ల‌క్ష‌ల‌కుపైగా షేర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇకపోతే..ఈ శుక్ర‌వారం రిలీజైన అన్ని సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా సుంద‌రం మాస్ట‌ర్ నిలిచింది. దీంతో హర్షా చెముడు కామెడీకి ఈ వీకెండ్ మస్త్ మజా అని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

సుంద‌రం మాస్ట‌ర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే..రూ.3 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డేనే కోటికి పైగా కల్లెక్షన్స్ రావడంతో..ఫ‌స్ట్ వీకెండ్ పూర్త‌య్యేలోగా సుంద‌రం మాస్ట‌ర్ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం చాలా ఈజీ అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. మరి చూడాలి ఏమవుతుందో!

సుందరం మాస్టరు స్టోరీ విషయానికి వస్తే.. 

అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఒక గిరిజన గ్రామానికి..అసలు ఈ మాత్రం ఇంగ్లీషే రాని ఒక సోషల్ మాస్టర్ ను ప్రభుత్వం ఏరికోరి పంపుతుంది. అందుకు కారణం అతడు చూడటానికి నల్లగా ఉండటమే. అతడే సుందరం.ఇక ఆ గ్రామంలో అమ్మాయిలకు నల్లవారు అంటే అదోరకమైన మక్కువ. అందుకే సుందరాన్ని అతిసుందరుడు గా భావించి రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు గిరిజనులు. అయితే సుందరాన్ని ఆ ఊరికి పంపడానికి కారణం..ఆ ఊరిలో ఏదో తెలియని రహస్యం ఉందని సుందరానికి తెలుస్తోంది. ఆ రహస్యం ఏంటీ? అనేది మిగతా కథ.