Kalki 2898AD: టక్కరా టక్క బీట్కు..ప్రభాస్ మాస్ స్టెప్పులు

Kalki 2898AD: టక్కరా టక్క బీట్కు..ప్రభాస్ మాస్ స్టెప్పులు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD). టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న నాగ్ అశ్విన్(Nag Ashwin) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో కల్కి పాటల నగారా మోగించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

లేటెస్ట్గా మేకర్స్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో బ్లాక్ షూస్తో తా టక్కరా టక్క టక్కరా బీట్కు హీరో ప్రభాస్ కాలు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వదిలిన ఈ చిన్న గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తా టక్కరా మాస్ బీట్ సాంగ్కు ప్రభాస్ తన డ్యాన్స్తో కాలు కదుపుతుంటే..ఫ్యాన్స్కు పూనకాలు వస్తున్నాయి. అయితే, ప్రభాస్ కాలు కదిపితేనే ఇంత ఎక్సయిట్ ఫీలింగ్ ఏంటనే ప్రశ్న సహజంగా రావొచ్చు. కానీ, ఇక్కడ కారణం ఉంది.

అదేంటంటే..బాహుబలి-1,బాహుబలి-2, సలార్,రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ మాస్ డ్యాన్స్ను చాలా వరకు ఫ్యాన్స్ మిస్ అయ్యారు.కనుకే, తా టక్కరా సాంగ్తో శివాలెత్తి పోవడం కన్ఫమ్. ఇక త్వరలో కల్కి ఫస్ట్ సింగిల్ తా టక్కరా అప్డేట్ రానుంది. అలాగే, త్వరలో కల్కి నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిన డైరెక్టర్ నాగ్..సాంగ్స్ తో ఎలాంటి కొత్త దనం చూపించబోతున్నాడో తెలియాల్సి ఉంది

ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో రాబోతుంది.