హర్షిత్‌‌‌‌ రాణాను పంపించేశారు.. ఫాస్ట్ బౌలర్‎ను జట్టు నుంచి రిలీజ్ చేసిన బీసీసీఐ

హర్షిత్‌‌‌‌ రాణాను పంపించేశారు.. ఫాస్ట్ బౌలర్‎ను జట్టు నుంచి రిలీజ్ చేసిన బీసీసీఐ

బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌తో తొలి టెస్ట్‌‌‌‌ కోసం టీమిండియాలోకి ప్రత్యామ్నాయ బౌలర్‌‌‌‌గా వచ్చిన పేసర్‌‌‌‌ హర్షిత్‌‌‌‌ రాణాను టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసింది. ఆసీస్‌‌‌‌తో రెండు టెస్ట్‌‌‌‌లు ఆడిన రాణా.. ఇండియా–ఎ జట్టులో సభ్యుడిగా ఇంగ్లండ్‌‌‌‌లో పర్యటించాడు. కాంటర్‌‌‌‌బరీలో ఇంగ్లండ్‌‌‌‌ లయన్స్‌‌‌‌తో జరిగిన అనధికార టెస్ట్‌‌‌‌లో 27 ఓవర్లు వేసి 99 రన్స్‌‌‌‌ ఇచ్చి ఒక్క వికెట్‌‌‌‌ మాత్రమే తీశాడు. దాంతో అతన్ని టీమిండియా నుంచి తప్పించారు. 

ఫలితంగా రాణా జట్టుతో పాటు బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌కు వెళ్లలేదు. ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, అన్షుల్‌‌‌‌ కాంబోజ్‌‌‌‌ మాత్రం టీమ్‌‌‌‌తో పాటే కొనసాగుతున్నారు. గంభీర్‌‌‌‌ శిష్యుడిగా పేరొందిన రాణా పెర్త్‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కట్టర్‌‌‌‌తో ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. కాలక్రమంలో అతను రెడ్‌‌‌‌ బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడటానికి సిద్ధంగా లేడని తేలడంతో ప్రత్యామ్నాయ బౌలర్‌‌‌‌గా ఉపయోగించుకున్నారు.