అగ్నికి ఆహుతైన గోధుమ పంట

అగ్నికి ఆహుతైన గోధుమ పంట

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతైంది.హర్యానా కర్నాల్ లోని కచ్వా గ్రామంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కచ్వాలోని పంటపొలాల్లో మంటలు చెలరేగాయి.గాలికి తీవ్రంగా మంటలు వ్యాపించాయి. 5 కిలో మీటర్ల మేర వ్యాపించిన మంటలకు.. సుమారు 200 ఎకరాల్లో గోధుమ పంట నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.పంట పొలాల్లో మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టినా.. గోధుమ పంట ధ్వంసమైందన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వచ్చారని రైతులు ఆరోపించారు. తమ కళ్లముందే  గోధుమ పంట అగ్నికి ఆహుతవ్వడంతో అన్నదాతులు తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. 

మరిన్ని వార్తల కోసం

14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు

షాంఘైలో ఆకలి కేకలు!