ఫస్ట్ ప్రైజ్ : రోజుకు 60 లీటర్ల పాలు..

ఫస్ట్ ప్రైజ్ : రోజుకు 60 లీటర్ల పాలు..

ఓ దేశీ ఆవు మామూలుగా అయితే రోజుకు ఎన్నిలీటర్ల పాలిస్తుంది? మహా అయితే రోజుకు పదిలీటర్లు. కానీ, రోజుకు ఓ ఆవు 60 లీటర్ల పాలిస్తే..పోటీల్లో ఫస్ట్​ ప్రైజ్ గెలిచేస్తే..? అవును, నేషనల్డెయిరీ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్ (ఎన్ డీఆర్ ఐ) మూడురోజుల పాటు నిర్వహించిన నేషనల్ డెయిరీమేళాలో ఓ ఆవు ఆ ఘనత సాధించిం ది. 58.86లీటర్ల పాలిచ్చి ఫస్ట్​ ప్రైజ్ కొట్టేసింది. అందంలోనూతనకు తానే సాటి అని నిరూపించుకుంది.

హర్యానాలోని కర్నాల్ జిల్లా దాదూపూర్ గ్రామానికిచెందిన ప్రదీప్ అనే రైతుకు చెందిన హెచ్ ఎఫ్ క్రాస్బ్రీడ్ ఆవు ఆ రికార్డు ను తన సొంతం చేసుకుంది.ఈ హెచ్ ఎఫ్ జాబితాలో బరణి ఖల్సాకు చెందినవిజేందర్ చౌహాన్ అనే రైతుకు చెందిన మరో ఆవు58.17 లీటర్ల పాలిచ్చి రెండో ప్రైజును సొంతం చేసుకుంది. ఇతర క్రాస్ బ్రీడ్ జాతుల ఆవులకు సంబంధించిన పోటీల్లో అంబాలా రైతు జస్దీప్సింగ్ కు చెందిన ఆవు 26.97 లీటర్ల పాలిచ్చి ఫస్ట్​ ప్రైజు సొంతం చేసుకుంది. దేశీ కేటగిరీలో తరౌరీకి చెందిన రామ్ సింగ్ ఆవు 21.31 లీటర్ల పాలతో ఫస్ట్​ ప్లేస్ లో నిలిచింది. నరేశ్ అనే రైతుకు చెందిన ఆవు 15.81 లీటర్లతో రెండో స్పాట్ లో నిలిచింది.ఇక, ముర్రే జాతి గేదెల పోటీల్లో అసంధ్ కు చెందినరణ్ దీప్ అనే రైతుకు చెందిన గేదె 21.77 లీటర్ల పాలిచ్చింది. ఫస్ట్​ ప్లేస్ కొట్టేసింది.