మరో ఉద్యమం : ఢిల్లీ వైపు దూసుకొస్తున్న హర్యానా రైతులు

మరో ఉద్యమం : ఢిల్లీ వైపు దూసుకొస్తున్న హర్యానా రైతులు

పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ హర్యానా రైతులు కురుక్షేత్రలో ఢిల్లీ, హర్యానా నేషనల్​ హైవేని దిగ్బంధించారు.
కురుక్షేత్ర జిల్లా పిప్లి గ్రామంలో జరిగిన 'మహాపంచాయతీ'లో ట్రాఫిక్‌ను అడ్డుకోవాలని వారు నిర్ణయించారు.  

హర్యానా, పంజాబ్, యూపీ ఇతర పొరుగు రాష్ట్రాల నుండి వ్యవసాయ నాయకులు పిప్లి ధాన్యం మార్కెట్ వద్ద 'ఎంఎస్​పీ దిలావో, కిసాన్ బచావో' అనే నినాదాల చేస్తూ మహాపంచాయత్ కోసం తమ డిమాండ్‌ను నొక్కిచెప్పేందుకు తరలివచ్చారు. వీరంతా ఢిల్లీకి తరలివెళ్తుండటంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.